
శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దేశంలో బంగారానికి గిరాకీ ఏర్పడింది. దీంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఒక్కసారిగా పసిడి ఆభరణాలకు డిమాండ్ ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం రేట్ రూ.60,050 ఉండగా.. శనివారం అది రూ.430 పెరిగి రూ.60,480కు చేరుకుంది. కిలో వెండి ధర ఈ రోజు రూ.75,550గా ఉంది. ఇది నిన్న రూ.75,370గా ఉండగా.. ఇవాళ రూ.180 మేర పెరిగింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ ఇవే రీతిలో ధరలు ఉన్నాయి.