హరీశ్ రావుపై హాట్ కామెంట్స్ చేసిన MLA మైనంపల్లి హన్మంతరావు.. తాను పార్టీని తిట్టలేదని, పార్టీ కూడా తనను ఏమీ అన్లేదని తెలిపారు. జీవితంలో స్థిరపడటం అంటూ ఉండదని, ప్రాణం పోతేనే స్థిరపడినట్లన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మైనంపల్లి హన్మంతరావు.. తన తనయుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నది హరీశ్ రావేనని మండిపడ్డ సంగతి తెలిసిందే. తిరుమల యాత్ర నుంచి తిరిగివచ్చిన హన్మంతరావు.. రేపట్నుంచి వారం పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. గతంలో తెదేపా మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేశానని, ఇప్పుడు BRSలో ఉన్నా ఎన్నడూ వెన్నుపోటు పొడవలేదని మాట్లాడారు.
తన కుమారుడికి 25 సంవత్సరాలే అని, ఇంకా ఆయనకు ఫ్యూచర్ ఉందన్నారు. కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని, వారం తర్వాత భవిష్యత్తు కార్యాచరణను మీడియాకు వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు.