
ప్రపంచంలో బతుకు వెళ్లదీయాలంటే చదువు(Education) ఎంతో అవసరమని, విద్యార్థుల భవిష్యత్తు(Future)ను మార్చేలా ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు రూ.15,593 కోట్ల మేర ఆర్థిక సాయం అందించామని, నేటి తరం జీవితాంతం ఆనందంగా గడపాలంటే విద్య అవసరమని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన జగన్.. విద్యా దీవెన గురించి వివరించారు. నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నామని, 100 శాతం ఫీజులు ప్రతి మూణ్నెల్లకోసారి అందజేస్తున్నామన్నారు.
మూడో విడతలో రూ.680.33 కోట్లను అకౌంట్లలో వేశామని.. ఏప్రిల్, మే, జూన్ కు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేశామన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో పిల్లల చదువుల మీదే ధ్యాస పెట్టామని జగన్ అన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ స్టూడెంట్స్ కు రూ.20 వేలు.. పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ITI స్టూడెంట్స్ కు రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. కాలేజీల్లో బోధన, వసతులు సరిగా లేకపోయినా, అడిషనల్ గా ఫీజులు అడిగినా 102కు ఫోన్ చేయాలన్నారు.