చెస్ చిచ్చరపిడుగు, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ముగించుకుని స్వరాష్ట్రానికి చేరుకున్న ప్రజ్ఞానందకు.. తమిళనాడులో ఘన స్వాగతం దక్కింది. ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకున్న క్రీడాభిమానులు.. బొకేలతో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. వాయిద్యాలు, మేళ తాళాలతో సందడి చేశారు. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ కు తొలి రెండు రౌండ్లలో ముచ్చెమటలు పట్టించిన 18 ఏళ్ల ఈ చెన్నై చిన్నోడు.. భవిష్యత్ భారత చెస్ తారగా ఎదుగుతున్నాడు. ఫైనల్ లో ఓడి రన్నరప్ గా నిలిచినా అందరి మనసులు దోచాడు. తమలో ఒకడిగా తిరిగిన వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరడంతో వెల్ కమ్ చెప్పేందుకు అతని క్లాస్ మేట్స్ తో పాటు సన్నిహితులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.
అటు వరల్డ్ నంబర్ వన్ గా రికార్డులు క్రియేట్ చేసిన విశ్వనాథన్ ఆనంద్ సైతం ప్రజ్ఞానందపై ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి తనకు లభించిన స్వాగతంపై ఈ చిన్నోడు ఎమోషనల్ అయ్యాడు. ఈ అభిమానాన్ని ఇలాగే కాపాడుకుంటానని, చెస్ లో మరిన్ని టైటిల్స్ సాధిస్తానన్నాడు.