పెన్షన్ విద్రోహ దినంగా సెప్టెంబరు 1ని పేర్కొంటూ టీచర్ల యూనియన్లు రేపు ధర్నాకు దిగుతున్నాయి. CPS రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, మధ్యంతర భృతి వంటి డిమాండ్లతో రేపు హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద USPC ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసనకు దిగుతున్నారు. 2004 సెప్టెంబరు 1 కన్నా ముందే ప్రక్రియ పూర్తయి నియామకమైన వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని, ఆమోదం పొంది ట్రెజరీల్లో ఏడాది కాలంగా పెండింగ్ లో పడిపోయిన బిల్లుల్ని వెంటనే రిలీజ్ చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఐదింటి వరకు జరిగే ధర్నాలో 18 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఐక్య వేదిక పాల్గొంటుంది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కార్యక్రమానికి అటెండ్ అవుతారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రకటించింది.
శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం ఐదింటి వరకు జరిగే ధర్నాలో 18 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఐక్య వేదిక పాల్గొంటుంది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కార్యక్రమానికి అటెండ్ అవుతారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రకటించింది.