ఈ మధ్యే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ గా నిలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇప్పుడు జ్యూరిచ్ డైమండ్ లీగ్ టోర్నమెంట్ లో సెకండ్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో 80.79 మీటర్లు విసిరిన నీరజ్… ఆరో ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు వాద్లిచ్ 85.86 మీటర్లతో ఫస్ట్ ప్లేస్… జర్మనీకి చెందిన వెబర్ 85.04 మీటర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించారు.