
సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. కౌంట్ డౌన్ ను స్టార్ట్ చేసింది. రేపు ఉదయం 11:50 గంటలకు ప్రయోగించనున్న రాకెట్ కోసం 24 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇందుకోసం ISRO ఛైర్మన్ సోమనాథ్.. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు. PSLV C57 ద్వారా ఆదిత్య-ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లో పరిస్థితిని సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్ అయిన తర్వాత ప్రయోగిస్తున్న మొదటి ప్రయోగం ఆదిత్య-ఎల్ 1. చంద్రుడిపై ఇప్పటికే ప్రజ్ఞాన్ రోవర్ విస్తృత పరిశోధనలు నిర్వహిస్తుండగా… సూర్యుడు, అంగారకుడిపై రీసెర్చ్ చేయాలని ISRO నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి రెడీ అయింది.
సూర్యుడిపై అధ్యయనం కోసం ఏడు పేలోడ్ లను మోసుకెళ్లే మిషన్ ను ISRO పంపుతోంది. దేశవ్యాప్తంగా గల వివిధ సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ ను నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు.