
గత 50 నెలల కాలంలో రూ1,977 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీలు ఇచ్చామని, పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతులు అప్పుల పాలు కాకుండా చూసుకుంటున్నామని ముఖ్యమంత్రి YS జగన్ అన్నారు. రాష్ట్రంలో అర హెక్టారు భూమి కలిగిన అన్నదాతలు 60 శాతం ఉన్నారని, దాన్ని ఒక హెక్టారు కిందకు లెక్కిస్తే ఆ శాతం 78గా ఉంటుందని తెలిపారు. రైతు భరోసా-PM కిసాన్ నిధుల్ని 2023-24కు సంబంధించి తొలివిడతగా జగన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రూ.31 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలను పటిష్ఠం చేశామన్నారు.
ఏటా రూ.13,500 కోట్లు(కేంద్రం వాటా రూ.6,000కోట్లు, రాష్ట్ర వాటా రూ.7,500) విడుదల చేస్తూ కౌలు రైతుల పట్ల తమ ప్రభుత్వం పూర్తి శ్రద్ధ పెడుతోందన్నారు. పంటలు కోల్పోయిన రైతులకు ఎప్పటికప్పుడు ఆయా సీజన్లలోనే నిధుల్ని అందజేస్తున్నామన్న జగన్.. పలువురు రైతులతో వర్చువల్ గా మాట్లాడారు.