అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటే.. అతడికి మాత్రం భక్తులు ఉంటారు. ప్రపంచమంతా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటే.. ఆయన అభిమానులు మాత్రం ‘సెప్టెంబరు 2’నాడే న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఎడమ చేత్తో బెల్టు పట్టుకుని నడుం ఊపుతూ డ్యాన్స్ చేశారంటే.. యూత్ మొత్తం ఊగిపోవాల్సిందే. డైలాగ్ మేనరిజంలో చూపించే డిఫరెంట్ స్టైల్ తో చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఫిదా అయిపోవాల్సిందే. సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ పెట్టారా… అది నా కోసమే అన్నట్లు ఒకటే ఫాలోయింగ్. మైకు పట్టుకుని ప్రజల్లోకి వెళ్లారా.. ఆ మాట వినాలని పరితపించే వాళ్లకు లెక్కే లేదు. ఇంతకన్నా మించి పవన్ కల్యాణ్ గురించి చెప్పేదేముంటుంది. పవర్ స్టార్ బయటకు కనిపించే ప్రతి రోజును పండుగలాగా భావించే ఫ్యాన్స్… ఇక ఆయన బర్త్ డే నాడు ఊరుకుంటారా. నిజంగానే అలాంటి హ్యాపీ మూడ్ లో మునిగిపోయారు ఈరోజు. ఎందుకంటే ఇవాళ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కాబట్టి.
1996లో ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్. ఇక 1999లో వచ్చిన ‘తొలి ప్రేమ’ గురించి చెప్పనవసరం లేదు. కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నేషనల్ అవార్డుతోపాటు 6 నంది పురస్కారాల్ని సొంతం చేసుకుంది. ‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాలతో తన ‘స్టార్ డమ్’ ఏంటో చూపించారు. ఒక్క టాలీవుడే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న వ్యక్తి పవన్. సినిమాల పరంగా ఇదంతా ఒకెత్తయితే ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ఒక సంచలనం. ‘జనసేన’ పార్టీని స్థాపించి దశాబ్దం కంప్లీట్ కాగా.. స్టార్టింగ్ డే నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెయిన్ రోల్ పోషిస్తున్నారు. సినిమాల్లో పవన్ ది మెయిన్ లీడ్ అయితే.. పాలిటిక్స్ లో కచ్చితంగా ఈ పవర్ స్టార్ ది మెయిన్ రోల్ అని చెప్పాలి. అభిమానుల్లో విపరీతమైన క్రేజ్.. జనాల్లోకి చొచ్చుకెళ్లగలిగే మనస్తత్వం.. సమస్యల్ని స్పష్టంగా వివరించగలిగే నేర్పు.. ఈ మూడు లక్షణాలే పవన్ ని మిగతా వారందరికన్నా డిఫరెంట్ గా ఉంచుతున్నాయి.
పాలిటిక్స్ లో పవన్ ను గమనిస్తే.. పదవులు అందుకోవడానికి ఆయనకు పెద్దగా టైమ్ అవసరం లేదన్నది అందరికీ తెలిసిన మాటే. కానీ పదవులపై కాకుండా ప్రజల కోసమేనంటూ జనాల్లోకి వస్తున్న ఈ స్టార్.. ఏదో ఒక పార్టీకి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నైజమే అతనికి పదవులు దక్కకుండా చేస్తుందన్న ప్రచారం ఉన్నా దాన్ని ఏనాడూ పట్టించుకోలేదాయన. జగన్ సర్కారుకు ఎదురొడ్డి నిలుస్తున్న నైజమే పవన్ ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి ఎవరంటే పవన్ కల్యాణే అన్న మాట వినపడుతోంది. ఇప్పటికే వారాహి యాత్రలతో గ్రౌండ్ లెవెల్ కు చేరుకున్న PSPK.. జనాల్ని పలుకరిస్తూ, అభిమానుల్ని అలరిస్తూ రాజకీయ యవనికలో తన స్పెషాలిటీని చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి కాగల స్థాయి పవన్ లో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి జగన్ సర్కారుకు గట్టి పోటీ నిచ్చేలా తయారవుతున్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారోనన్న యాంగ్జయిటీ అందరిలోనూ ఉంది. ఇప్పటికే మూవీల పరంగా పవర్ స్టార్ గా ఎదిగిన పవన్.. ఇక పొలిటికల్ స్టార్ గా ఎదగాలని ఆయన్ను అభిమానించే వారంతా కోరుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ పెట్టకున్నా 40 గంటల్లోనే 20 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన అభిమానం వెలకట్టలేనిది. ఆయన స్టేటస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేకున్నా.. ఆయన్నే ‘స్టేటస్’ గా పెట్టుకుని సెల్ ఫోన్లలోనే దేవుడిగా చూసుకునేవారికి కొదువే ఉండదు.