యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించగా.. సాక్షి వైద్య ఫిమేల్ లీడ్‌గా నటించింది. అయితే ‘ఏజెంట్’ మూవీ మే 19వ తేదీ నుంచే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని గతంలో ప్రకటించారు. కానీ ఓటీటీ వెర్షన్ కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పెషల్‌గా మళ్లీ ఎడిట్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మరోసారి ఓటీటీ రిలీజ్ వాయిదాపడగా.. జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
నిజానికి ‘ఏజెంట్’ మూవీపై అఖిల్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. రెండు మూడేళ్లు ఈ ఒక్క సినిమా కోసమే విపరీతంగా కష్టపడ్డాడు. యాక్షన్ సీన్లు హాలీవుడ్ రేంజ్‌ను తలపించినప్పటికీ.. కథనంలో లోపాల కారణంగా ఫ్లాప్‌గా నిలిచింది ‘ఏజెంట్’. అయితే రిలీజ్‌కు ముందు టైమ్ లేకపోవడంతో సరిగ్గా ఎడిట్ చేయలేదని భావించిన సురేందర్ రెడ్డి.. మరోసారి షార్ప్ ఎడిటింగ్ చేయిస్తున్నారని, కొన్ని అదనపు సీన్లు యాడ్ చేయిస్తున్నారని తెలుస్తోంది. చూద్దాం.. మరి ఓటీటీలోనైనా ‘ఏజెంట్’ హిట్ టాక్ తెచ్చుకుంటుందో లేదో!