
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై ఇప్పటికే కోర్టులో విచారణ సాగుతుండగా.. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నిక అంశంపై అడ్వొకేట్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇక నుంచి సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను ఈ అడ్వొకేట్ కమిషన్ నమోదు చేయనుంది. అటు ఈ కమిషన్ ఎదుట హాజరుకావాలని పలువురు అధికారులను సమన్లు పంపాలని ఆదేశించింది.
పిటిషనర్ పేర్కొన్న సాక్షులకు సమన్లు పంపాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.