రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 16 మంది పేర్లతో కూడిన లిస్టును ప్రకటించగా.. ఇందులో రాష్ట్రానికి చెందిన ఒకే ఒక్క సీనియర్ లీడర్ కు చోటు దక్కింది. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన ఈ కమిటీలో నల్గొండ MP ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. దేశంలోని అగ్రశ్రేణి లీడర్లను ఈ కమిటీకి నియమించారు. సోనియా, రాహుల్, అధిర్ రంజన్ చౌధురి, సల్మాన్ ఖుర్షీద్, అంబికాసోనీ, కె.సి.వేణుగోపాల్, మధుసూదన్ మిస్త్రీ, సింగ్ దేవ్, పునియా, ఓంకార్, అమీయాజ్ఞిక్, కె.జె.జార్జ్, ప్రీతమ్ సింగ్, మహ్మద్ జావెద్ సభ్యులుగా ఉంటారు.
ఈ నూతన కమిటీ రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించనుంది.