కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒప్పంద, ప్రత్యేక ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ(Regularization)కు అనుమతి ఇచ్చింది. సాంఘిక సంక్షేమ(Social Welfare) గురుకులాల్లో 567 మంది టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఇంతకుముందే నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై SC అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి KCR ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సర్కారు… ఇందుకు సంబంధించిన జీవో నంబరు 11ను విడుదల చేసింది.
మొత్తం 567 మందిలో 504 మంది మహిళా టీచర్లు ఉండగా… వీరంతా 2007 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో విధుల్లో ఉన్నారు. మరోవైపు ఒప్పంద ఉద్యోగులకు 12 నెలల జీతం, బేసిక్ పేతోపాటు 6 నెలల ప్రసూతి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది.