జనాభాలో కీలక స్థాయిలో ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదన్నది అందరికీ తెలిసిన మాటే. 20 శాతం లేని మూడు అగ్ర కులాలకు అత్యధిక సీట్లు కట్టబెట్టి.. 56 శాతానికి పైగా జనాభా ఉన్న BCలకు మాత్రం రిక్తహస్తాలే చూపిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో BC ఓటర్లను పావులుగా వాడుకోవడమే తప్ప పొలిటికల్ ప్రాధాన్యం దక్కింది చాలా తక్కువ. అందుకే రాజకీయంగా పెద్దపీట వేసి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్నూరు కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు.. ప్రగతి భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో తమ సామాజికవర్గం జనాభా(Population) పెద్ద సంఖ్యలో ఉన్నా సరైన పొలిటికల్ ప్రాధాన్యం దక్కడం లేదంటూ చాలా కాలంగా ఆ వర్గంలో అసంతృప్తి నెలకొని ఉంది.
మిగతా సామాజికవర్గాల(Community) కన్నా ఎక్కువగా జనాభా ఉన్న మున్నూరు కాపుల్ని చిన్నచూపు చూస్తున్నారంటూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో ఆ కమ్యూనిటీ లీడర్లు, శ్రేణులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.