రాష్ట్ర మంత్రి కుటుంబ సభ్యులకు ఈడీ(Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలపై గతేడాది నవంబరులో ఈడీ సోదాలు నిర్వహించింది. ఫెమా నిబంధనల కింద ఎందుకు ఫైన్ వేయకూడదో చెప్పాలని నోటీసుల్లో తెలిపింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన కంపెనీలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజన్సీస్ పేరుతో గంగుల సుధాకర్, గంగుల వెంకన్న వీటిని నిర్వహిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి గ్రానైట్ ను చైనాకు ఎగుమతి చేశారన్న కారణంతో ఫెమా నిబంధనల అతిక్రమణ కింద ఈడీ నోటీసులు.. రెండు కంపెనీలకు జారీ అయ్యాయి.