ఎన్నికల వివాదాల కేసుల్ని క్రమక్రమంగా పరిష్కరించాలని భావిస్తున్న హైకోర్టు… కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై మండిపడింది. కేసులు వేసి సమయానికి అటెండ్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. మంత్రి గంగుల కమలాకర్ కేసులో పిటిషనర్ బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం చెందింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ అవడానికి సంజయ్ పదే పదే గడువు కోరడంపై అసహనం వ్యక్తం చేసింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ సంజయ్ వేసిన పిటిషన్ పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ నడిచింది.
ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కు సంబంధించి BJP ఎంపీ మూడు సార్లు సమయం కోరారు. బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నందున గడువు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్ కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 12న విచారణకు కచ్చితంగా వస్తారని న్యాయవాది విన్నవించారు. దీనిపై అసహనం చెందిన కోర్టు.. సైనిక సంక్షేమ నిధికి రూ.50 వేలు చెల్లించాలని సంజయ్ ను హైకోర్టు ఆదేశించింది.