చంద్రబాబు లేదా ఏ బాబు అయినా సరే తప్పు చేసినట్లు తేలితే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తప్పు చేస్తే తప్పించుకోరు.. ఒప్పు చేస్తే బయటకు రాకుండా ఉండలేరంటూ కామెంట్ చేశారు. రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారంలో ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా అధికారులు ముందడుగు వేయలేరని అంబటి అన్నారు. ఇక చంద్రబాబు తప్పు చేసినట్లు తేలినా ఆయన ఒప్పే చేశారని పవన్ కల్యాణ్ అంటారని, అలా ఈ ఇద్దరి మధ్య బంధం పెనవేసుకుపోయిందని విమర్శించారు.