జూనియర్ లెక్చరర్ల(JL) నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. వీటిని TSPSC వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులంతా TSPSC వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,392 జూనియర్ లెక్చరర్ల రిక్రూట్మెంట్ కు రాత పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 3 వరకు పరీక్షలు జరగనుండగా.. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం విడుదలయ్యాయి. http://www.tspsc.gov.in వెబ్ సైట్ లాగిన్ వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ లో జరిగే ఈ ఎగ్జామ్స్ ను రోజూ పొద్దున, మధ్యాహ్నం నిర్వహిస్తారు. 11 రోజుల పాటు 16 పరీక్షలు జరగనుండగా.. పొద్దున జనరల్ స్టడీస్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్ట్ పేపర్ రాయాల్సి ఉంటుంది. మునుపెన్నడూ లేని రీతిలో మల్టీజోన్-1లో 724, మల్టీజోన్-2లో 668 పోస్టులు రిక్రూట్ కావడం ఇదే తొలిసారి.