ప్రస్తుత వరల్డ్ క్రికెట్ లో తమ దేశ బౌలర్లే టాప్ అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ముగ్గురు సీమర్ల ఆటను చూస్తే మళ్లీ పాత రోజులు గుర్తుకువస్తున్నాయని, ఇది సంతోషకరమైన విషయమన్నాడు. స్టార్ స్పోర్ట్స్ తో ఛాట్ సందర్భంగా రావల్పిండి ఎక్స్ ప్రెస్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రవూఫ్ ఆటతీరు చూస్తే ప్రపంచంలో ఈ త్రయమే ద బెస్ట్ అని.. ముఖ్యంగా అప్రిది చాలా డేంజరస్ అని కొడియాడాడు. భారత్ తో మ్యాచ్ లో 4 వికెట్లు తీయడమే అందుకు ఎగ్జాంపుల్ అన్నాడు. రన్స్ ఇచ్చినా సరే అధైర్యపడొద్దు.. కంటిన్యూగా వికెట్లు తీయడం మీదే దృష్టిపెట్టాలని రవూఫ్ కు గుర్తు చేశాడు. ఇక నసీమ్ కు ఈ మధ్యే SMS ఇచ్చానని, అతని టాలెంట్ లో ఎలాంటి అనుమానాలు లేవన్నాడు. బంతి వేగంతోపాటు వికెట్ల మీదకు గురిపెట్టాలని చెప్పానన్నాడు.
సీమ్ బౌలర్లను తయారు చేయడంలో పాక్ క్రికెట్ బోర్డు ఎప్పుడూ ముందుంటుందని అన్నాడు. 1997-2011 కాలంలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రావల్పిండికి చెందిన షోయబ్ అక్తర్.. తన వేగంతో వరల్డ్ లోనే అత్యంత ఫాస్ట్ బౌలర్ గా పేరుపొందాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసి ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించాడు. అక్తర్ తర్వాత ఆస్ట్రేలియా పేసర్ బ్రెట్ లీ మాత్రమే ఇప్పటివరకు ఆ స్థాయిలో బంతులు విసిరేవాడు. 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్ లకు అక్తర్ ప్రాతినిధ్యం వహించాడు.