రాఖీపౌర్ణమి వేళ బస్సుల్లో ప్రయాణించినందుకు గాను RTC సంస్థ మహిళలకు నిర్వహించిన లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందాయి. హైదరాబాద్ MGBSలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ MD సజ్జనార్.. విజేతలకు గిఫ్ట్ లు అందజేశారు. రీజియన్ల వారీగా లక్కీ డ్రాల్లో గెలుపొందిన 33 మందికి రూ.5.5 లక్షల విలువైన బహుమతుల్ని అందజేశారు. ఫస్ట్ ప్రైజ్ రూ.25,000, సెకండ్ ప్రైజ్ రూ.15,000, థర్డ్ ప్రైజ్ రూ.10,000 చొప్పున అందించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు విశేష స్పందన వచ్చిందని, 3 లక్షల మంది మహిళలు ఆ రెండు రోజుల్లో జర్నీ చేశారని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల బంధాన్ని చాటే రాఖీపౌర్ణమి నాడు ఆర్టీసీకి అనూహ్య రీతిలో రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక నుంచి ఇదే విధానాన్ని వివిధ పండుగల వేళల్లో అమలు చేస్తామని RTC తెలిపింది. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలతోపాటు ఆడ్వాన్స్డ్ రిజర్వేషన్ చేసుకునేవారికి కూడా లక్కీ డ్రాను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది.