ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే బంగ్లాకు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో ఓడిన బంగ్లా… ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని లంక చూస్తోంది. ఇరు జట్లకు బ్యాటింగ్ కీలకం కాగా… మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ కొలంబోలో మొదలవుతుంది.