మొరాకోలో వచ్చిన భూకంపానికి భారీయెత్తున ప్రాణనష్టం సంభవించింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో 1,037 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో చాలా మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశంలోని మేజర్ సిటీల్లో భూకంపం రావడంతో వల్ల పెద్దసంఖ్యలో భవనాలు కూలిపోయాయి. రాజధాని రబాట్ తోపాటు దేశంలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన మెరాకెక్ సిటీలో భారీస్థాయిలో బిల్డింగ్స్ నేలమట్టమయ్యాయి. భూకంప తీవ్రతతో ప్రజలంతా రోడ్లపైకి వచ్చి హాహాకారాలు చేయడంతో మొరాకోలో భయంకర పరిస్థితులు కనిపించాయి. రిక్టర్ స్కేల్ పై 6.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది.
అటు మొరాకో భూకంప కేంద్రం మాత్రం రిక్టర్ స్కేల్ పై 7 తీవ్రత రికార్డయిందని ప్రకటించింది. ఉత్తర ఆఫ్రికా దేశాల్లో భూకంపాలు అత్యంత అరుదు(Rare)గా వస్తుంటాయి. 1960 అగాదిర్ లో 5.8గా నమోదైన భూకంపంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంప కేంద్రం మెరాకెక్ సౌత్ ప్రాంతాల్లోని పర్వతాల్లో 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.