
RTC ఉద్యోగ సంఘాలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశాయి. రవాణా సంస్థ JAC(Joint Action Committee)కి చెందిన ఎనిమిది యూనియన్ల లీడర్లు గవర్నర్ తో భేటీ అయ్యారు. న్యాయశాఖకు రిఫర్ చేసిన బిల్లు ప్రభుత్వానికి చేరి అక్కణ్నుంచి రాజ్ భవన్ కు వచ్చిందని దానిపై డిసిషన్ తీసుకోవాలని కోరినట్లు JAC నేతలు తెలిపారు. వేతన సవరణ, సిబ్బందికి చెందిన సొమ్మును సంస్థ వాడుకున్నందున ఆ లావాదేవీలను క్లియర్ చేసే విధంగా దృష్టిసారించాలని కోరారు. కారుణ్య నియామకాలకు సంబంధించి 975 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని.. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ లో కాకుండా రెగ్యులర్ గా ఉండాలని కోరినట్లు నేతలు తెలిపారు.
తమ సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నేతలు తెలిపారు. రెండు రోజుల్లో సవరణలు పూర్తి చేశాక ఆమోదించి వాటిని పంపుతామని తమిళిసై హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం అంశం పెండింగ్ లో పడిపోవడంతో యూనియన్ల లీడర్లు మరోసారి గవర్నర్ ను కలిశారు.