ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీని ఎంత వేగంగా అందుకుంటే అంత మంచిది. ఇదే సూత్రాన్ని అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థలు దూసుకుపోతుంటాయి. కానీ కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ విషయంలో కాస్త వెనుకబాటులోనే ఉంటాయి. అయితే అందుకు తాము భిన్నమని RTC నిరూపించబోతున్నది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా అన్ని బస్సుల్లో ఐ-టిమ్స్ మెషిన్ల(Machine)ను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ఇకనుంచి RTC బస్సుల్లో ‘చిల్లర’ గొడవకు తెరపడే అవకాశం కనిపిస్తున్నది. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో టికెట్లు కొనుక్కోవచ్చు. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని(Implement) భావించి బండ్లగూడ డిపోను సంస్థ ఇందుకు ఎంపిక చేసింది.
బండ్లగూడ డిపోలోని 145 బస్సుల్లో ఐ-టిమ్స్ సిస్టమ్ త్వరలోనే అందుబాటులోకి తెస్తారు. ఇదే విధానాన్ని కంటోన్మెంట్ డిపోలోనూ చూశాక అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు. దీన్ని ఇప్పటికే 700 సూపర్ లగ్జరీ, AC బస్సుల్లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మిగతా అన్ని బస్సులకూ వర్తింపజేస్తుండటంతో కండక్టర్లు, ప్రయాణికుల చిల్లర గొడవకు తెరపడే అవకాశముంది.