ఉపాధ్యాయుల(Teachers) బదిలీల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిపోయిన ఖాళీల పూర్తిపై హైకోర్టు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వీటికి రెండేళ్ల సర్వీసు నిబంధనల్ని పరిగణలోకి తీసుకోకుండా టీచర్ల అప్లికేషన్లను తీసుకోవాలని ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. టీచర్ల ట్రాన్స్ ఫర్స్ లో రెండేళ్ల సర్వీసు రూల్స్ తో పరస్పర బదిలీలు, ఖాళీలు ఉన్నచోట ట్రాన్స్ ఫర్స్ చేయకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 30 పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ లను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు.
నిబంధనల ప్రకారం బదిలీలు పూర్తయిన తర్వాత ఖాళీ ఏర్పడ్డ స్థానాల్లో పిటిషనర్ ల అప్లికేషన్లు పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. సర్కారుకు నోటీసులు జారీ చేసి, కౌంటర్లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ ఉత్తర్వలు ఇచ్చారు.