భారత్ లో అపార అవకాశాలు సృష్టిస్తున్న డిజిటలైజేషన్ కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్… భారీగా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. 10 బిలియన్ డాలర్లు(80 వేల కోట్ల రూపాయలకు పైగా) పెట్టుబడి పెడతామని గూగుల్ CEO సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో మీట్ అయిన పిచాయ్… ఫిన్ టెక్ లో భారతదేశ నాయకత్వాన్ని గుర్తించి ఈ డిసిషన్ తీసుకున్నామని తెలిపారు.
గాంధీనగర్ (గిఫ్ట్)కు గూగుల్…
గుజరాత్ గాంధీనగర్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ(గిఫ్ట్)పైనా గూగుల్ దృష్టిపెట్టింది. అక్కడ గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు సుందర్ పిచాయ్ మోదీని కలిసిన తర్వాత ప్రకటించారు. ‘చరిత్రాత్మక US టూర్ లోప్రధానిని కలవడం గౌరవంగా భావిస్తున్నా.. ఇండియన్ డిజిటలైజేషన్ ఫండ్ లో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నాం’ అని సుందర్ పిచాయ్ అన్నారు.