MLC, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు ఈడీ(Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం(Scam)లో ఆమెను విచారణకు హాజరుకావాలని ఈడీ నుంచి నోటీసులు వెలువడ్డాయి. శుక్రవారం(ఈనెల 15న) నాడు ఢిల్లీలోని ED కార్యాలయానికి హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరుణ్ పిళ్లై అప్రూవర్ గా మారడంతో ఈ కేసుపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో కవితను విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు రావడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఆరుగురు అప్రూవర్ గా మారారు.