ఆసియా కప్ తుది పోరు(Final)లో భారత్ తో తలపడేందుకు శ్రీలంక రెడీ అయింది. పాకిస్థాన్ ను ఓడించి ఆ జట్టు ఫైనల్ కు చేరుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 7 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఫకర్ జమాన్(9), బాబర్(29) త్వరగానే ఔటైనా.. మహ్మద్ రిజ్వాన్(86) ఆదుకున్నాడు. షఫీక్(52)తో కలిసి మంచి పార్ట్నర్ షిప్ నమోదు చేశాడు. ఇఫ్తికర్ అహ్మద్(47) కూడా రాణించడంతో పాక్ 6 రన్ రేట్ పైగా స్కోరు సాధించింది. పతిరణ 3, ప్రమోద్ 2 వికెట్లు తీశారు.
253 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లంక 42 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కుశాల్ మెండిస్(91), అసలంక(49), సమరవిక్రమ(48) లంకను గెలుపుబాట పట్టించారు. పాక్ బౌలర్లలో ఇఫ్తికార్ 3, అఫ్రిది 2 వికెట్లు తీసుకున్నారు. ఆదివారం భారత్-శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. జట్టును గెలిపించిన కుశాల్ మెండిస్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.