
కాంగ్రెస్ పార్టీకి దేశంలో అత్యంత కీలకంగా భావించే CWC(Congress Working Committee) సమావేశాలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు 60 మంది ప్రముఖ లీడర్లు భాగ్యనగరానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఈ మీటింగ్స్ హోటల్ తాజ్ కృష్ణాలో జరగనున్నాయి. ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగే పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ కు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది.
మరోవైపు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపకాల అంశంపైనా చర్చించే అవకాశముంది. వీరప్ప మొయిలీ, CMలు సీద్ధరామయ్య, భూపేశ్ బగేల్, అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ డిప్యూటీ CM సచిన్ పైలట్ తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. CWCకి వస్తున్న నేతలకు తెలంగాణ కళారూపాలతో రాష్ట్ర లీడర్లు వెల్ కమ్ చెబుతున్నారు.