రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఒక రకంగా అన్ని వర్గాలను టార్గెట్ గా చేసుకుని వరాల జల్లు కురిపించింది. తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఈ హామీలను ప్రకటించింది. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 అందిస్తామని సోనియాగాంధీ ప్రకటించారు. వీరికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. రైతు భరోసా కింద కర్షకులకు ఎకరాకు రూ.15,000 ఇవ్వనుండగా పట్టా భూమి రైతులతోపాటు కౌలు రైతులకు ఈ నగదు అందిస్తారు.
రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000, గృహజ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, యువ వికాసం కింద స్టూడెంట్స్ కు రూ.5 లక్షల వరకు సాయం, చేయూత కింద నెలకు పింఛన్ రూ.4,000, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా ప్రకటించారు.