కామెడీ థ్రిల్లర్ యాంగిల్ లో వస్తున్న కొత్త మూవీ.. ‘మిస్టరీ’. సీనియర్ నటులు సుమన్, తనికెళ్ల భరణి, అలీ మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. సాయికృష్ణ, స్వప్న చౌదరి జంటగా నటిస్తున్న ‘మిస్టరీ’ విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. అక్టోబరు 6న మూవీని రిలీజ్ చేస్తున్నామని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నిర్మాతలు విడుదల చేశారు. తల్లాడ సాయికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టరీ’.. నిజంగానే మిస్టరీ కథాంశాన్ని తలపిస్తూ సాగేలా రూపుదిద్దుకుంటోంది. P.V.ఆర్ట్స్ బ్యానర్ పై వెంకట్ పులగం దీన్ని నిర్మిస్తున్నారు. సుమన్, అలీ, తనికెళ్ల భరణి నటన ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని.. ముగ్గురు మోస్ట్ సీనియర్ యాక్టర్స్ నటిస్తుండటం తమ మూవీ అంచనాలను అమాంతం పెంచుతోందని నిర్మాతలు సంతోషంతో ఉన్నారు.
”మిస్టరీ’ మూవీ ఒక కామెడీ థ్రిల్లర్.. అవుట్ పుట్ చాలా బాగా రాబోతుంది. మంచి కథ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను మెప్పించేలా సినిమాను రూపొందించడంలో ప్రొడక్షన్ యూనిట్ శ్రమ మరువలేనిది.. ముఖ్యంగా దుగ్గిరెడ్డి, రవిరెడ్డి, బాబీకి కృతజ్ఞతలు.. అందరి అంచనాలకు అనుగుణంగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని దర్శకుడు తల్లాడ సాయికృష్ణ తెలిపారు. ‘మంచి స్టోరీ లైన్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.. అనేక ట్వీట్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది.. సినిమా యూనిట్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. హీరోయిన్ గా తన సినీ జీవితానికి ఇదో మైలురాయిగా నిలవబోతున్నందుకు ఆనందంగా ఉంది’ అని కథానాయిక స్వప్న చౌదరి అన్నారు. సత్యశ్రీ, గడ్డం నవీన్, షన్ను, సి.కె.రెడ్డి, శోభన్ కీలక రోల్స్ పోషిస్తున్న’మిస్టరీ’కి స్టోరీ, డైలాగ్స్ ను శివ కాకు, సంగీతం రామ్ తవ్వ, కెమెరా సుధాకర్ బార్ట్లే, ఎడిటింగ్ సూర్యతేజ గంజి అందిస్తున్నారు.