భారతదేశం చంద్రుడిని చేరుకుని, జీ20 సదస్సు జరుపుతుంటే పాకిస్థాన్ మాత్రం ప్రపంచాన్ని అడుక్కుంటోందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న తమ దేశంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ ఇంతగా దిగజారిపోవడానికి దేశ విధానాలు, మాజీ జనరళ్లు, న్యాయమూర్తులేనని ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ నిర్వహించిన సమావేశంలో లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన షరీఫ్.. పాక్ దయనీయ స్థితిని వివరించారు. ‘మన దేశ ప్రధాని ఇతర దేశాలు తిరుగుతూ నిధుల కోసం అడుక్కుంటున్నారు.. భారత్ పొందిన ఖ్యాతిని పాక్ ఎందుకు సాధించలేకపోయింది.. అందుకు బాధ్యులు ఎవరు’ అంటూ మాట్లాడారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ విదేశీ మారక నిల్వలు ఒక బిలియన్ డాలర్లు మాత్రమే.. కానీ ఇప్పుడు ఆ దేశ విదేశీ మారకం విలువ 600 బిలియన్ డాలర్లు.. భారత్ ఎక్కడకు చేరింది.. మనం ఎక్కడున్నాం’ అంటూ పాక్ మాజీ ప్రధాని షరీఫ్ ఆవేదనతో మాట్లాడారు.