హైదరాబాద్ లోని వివిధ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారడంతో భాగ్యనగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. KPHB కాలనీ, హబ్సిగూడ, పాతబస్తీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్, కోఠి, ఉప్పల్, మల్లాపూర్ తోపాటు చాలా ప్రాంతాల్లో పెద్దయెత్తున వాన పడింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు అంతటా వ్యాపించడంతో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ విభాగం హెచ్చరించింది.