ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ప్రాథమిక ‘కీ’ విడుదలయింది. ఈ ‘కీ’పై ఈ నెల 23 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. tstet.cgg.gov.inలో టెట్ ప్రాథమిక సమాధానాలు పొందుపరిచారు. ఈ నెల 15న జరిగిన ఎగ్జామ్ కు భారీ సంఖ్యలో అభ్యర్థులు అటెండ్ అయ్యారు. పేపర్-1కు 84.12 శాతం హాజరయ్యారు. పేపర్-2 పరీక్షను 91.11 శాతం మంది రాశారు.