
హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా పట్టుబడ్డ కేసులో సినీ కథానాయకుడు నవదీప్ కు పోలీసులు నోటీసులు పంపారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి బషీర్ బాగ్ లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో అటెండ్ కావాలని అందులో తెలియజేశారు. ఆగస్టు 31న మాదాపూర్ లోని అపార్ట్ మెంట్ లో దాడి చేసిన పోలీసులు.. డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. అందులో సినీ ఫైనాన్షియర్ తోపాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల పాటు నిందితుల్ని సుదీర్ఘంగా విచారించగా… మరికొందరి పేర్లు బయటపడ్డాయి. దీంతో మరోసారి ఎనిమిది మందిని పట్టుకోగా.. అందులో నైజీరియన్లు ఉన్నారు.
నవదీప్ డ్రగ్స్ సప్లయర్ తో సంబంధాలు ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ లో గుర్తించడంతో 37వ నిందితుడిగా ఆయన పేరు చేర్చారు. మొత్తంగా పోలీసులు ఈ కేసులో 11 మందిని రిమాండ్ కు తరలించారు. మత్తు పదార్థాలు సేల్స్ చేసే వ్యక్తితో ఈ నటుడికి ఉన్న పరిచయాలపై నార్కోటిక్ విభాగం దృష్టి సారించింది.