
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్ సభలో పాసయిన బిల్లు ఈ రోజు ఎగువ సభలోనూ ఆమోదానికి నోచుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. తొలుత దీనిపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. సభ్యుల ప్రసంగం అనంతరం ఓటింగ్ నిర్వహించారు.
ఈ ఓటింగ్ లో 215 మంది అనుకూలంగా ఓటు వేశారు. దీంతో బిల్లు పాసయినట్లు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ కఢ్ బిల్లు పాస్ అయినట్లు ప్రకటించారు. ఇక నుంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. లోక్ సభతోపాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) తర్వాత వీటిని అమలు చేస్తారు.
Good news for our BHARATH