ఖలిస్థాన్ తీవ్రవాదులకు మద్దతిస్తూ కెనడా.. ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భారత్ ఆరోపించింది. వేర్పాటువాదులు, వ్యవస్థీకృత నేరాలకు ఆ దేశం వేదికగా మారిందని స్పష్టం చేసింది. ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ను బద్నాం చేసిన ట్రూడో సర్కారు.. తమకు ఎలాంటి ఆధారాలు(Evidence) ఇవ్వలేకపోయిందని విదేశాంగ శాఖ తెలిపింది. కెనడాలోని భారత ఎంబసీకి బెదిరింపులు రావడం వల్లే వీసా సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇందులో భారత ఎంబసీ పాత్ర ఉందని పేర్కొంటూ దౌత్యాధికారిని వెనక్కు పంపించగా.. మన దేశం కూడా అదే రీతిలో దీటుగా సమాధానమిచ్చింది.