రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతున్నందున భారీ వానలు ఉంటాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నందున ‘ఎల్లో అలర్ట్’ జారీచేసింది.
రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.