పార్టీ లైన్ దాటి మాట్లాడిన లీడర్లపై చర్యలు తీసుకుంటామని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గట్టి వార్నింగ్ ఇచ్చారు. డిసిప్లిన్ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్న ఆయన.. అక్కడ కొందరు లీడర్లతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు అందరూ రెడీ కావాలని, తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్ గా పనిచేయాలన్నారు. ఎలక్షన్ ప్రిపరేషన్ పై అందరికీ దిశానిర్దేశం చేసిన నడ్డా… BRSతో సీరియస్ ఫైట్ ఉంటుందని వారికి వివరించారు.
