ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ నోటీసుల తీరును తప్పుబడుతూ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే దీనిపై విచారణను నవంబరు 20కి వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది. అయితే సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ అయ్యే నవంబరు 20 వరకు కవితను విచారణకు పిలవబోమని ED(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కోర్టుకు తెలిపింది.
పీఎంఎల్ఏ కేసుల విచారణ తర్వాతే
పీఎంఎల్ఏ కేసుల విచారణ తర్వాతే లిక్కర్ కేసు విచారణ చేపడతామని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ కేసు అక్టోబరు 18న హియరింగ్ కు రానుండగా.. దానిపై ప్రత్యేక విచారణ జరగనుంది.