PHOTO: THE TIMES OF INDIA
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. 41 ఏళ్ల తర్వాత ఈక్వస్ట్రియన్ విభాగంలో తొలి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్ లతో కూడిన భారత టీమ్.. డ్రస్సేజ్ ఈవెంట్ లో గెలిచి బంగారు పతకాన్ని అందుకున్నారు. ఆసియా క్రీడల ఈక్వస్ట్రియన్ విభాగంలో ఇది నాలుగో మెడల్ కాగా.. మిగిలిన మూడు మెడల్స్ 1982లో వచ్చాయి.
అటు సెయిలింగ్ లో ఇప్పటికే నేహ ఠాకూర్ సిల్వర్ మెడల్ సాధించగా.. ఇప్పుడు అదే విభాగంలో మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో రెండు కాంస్య(Bronze) పతకాలను ఎబాద్ అలీ, విష్ణు శరవణన్ మెడల్స్ గెలుచుకున్నారు.