సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాభాల్లో వాటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో 32 శాతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మధ్యకాలంలో సింగరేణి ఉద్యోగులకు ఎరియర్స్ విడుదలయ్యాయి. 11వ వేజ్ బోర్డుకు సంబంధించి రూ.1,450 కోట్లను పర్సనల్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రిలీజ్ చేశారు. మొత్తం 39,413 మంది ఉద్యోగుల(Employees)కు గాను రూ.1,450 కోట్లను రిలీజ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
ఎరియర్స్ ను యావరేజ్ గా పరిగణలోకి తీసుకుంటే ఒక్కో ఉద్యోగికి రూ.3,70,000 అందాయి. దసరా, దీపావళికి సంబంధించిన బోనస్ చెల్లింపులకు కూడా సింగరేణి సిద్ధంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ ఉద్యోగులు, కార్మికులకు లాభాల్లో వాటా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.