విధుల్లో ఉన్న 23 మంది జవాన్లు ఆకస్మిక వరదల్లో గల్లంతయ్యారు. తీస్తా నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సిక్కింలోని లాచెన్ వ్యాలీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న జవాన్లు కనిపించకుండా పోయారు. ఊహించని రీతిలో మేఘాలు విస్ఫోటనం(Cloud Burst) చెంది భారీ వర్షాలు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఫ్లడ్ రావడం, ప్రమాదకర పరిస్థితికి చేరుకున్న టైమ్ లో ఛుంగ్ తాంగ్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఈ ఉపద్రవం తలెత్తింది.
ఛుంగ్ తాంగ్ డ్యామ్ నుంచి 20 అడుగుల మేర నీరు దిగువకు వెళ్లడంతో సమీప ప్రాంతాల్లో విధుల్లో ఉన్న జవాన్లు గల్లంతయ్యారు. అదృశ్యమైన జవాన్ల వివరాలు తెలియాల్సి ఉంది.