ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ(TSRTC) ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. 4.8 శాతంతో మరో D.A.ను మంజూరు చేసింది. ఆక్టోబరు వేతనంతో కలిపి D.A. చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న మొత్తం 9 D.A.లు మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది.
విలీనానికి ముందే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆర్టీసీ సిబ్బంది డిమాండ్ చేశారు. 2017, 2021 వేతన సవరణ, CCSకు చెల్లించాల్సిన బకాయిలు, పెండింగ్ D.A.ల అమలు, 7 D.A.ల ఎరియర్స్ చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. విలీన సందర్భంలో ఒక D.A. విడుదల కాగా మిగిలిన చివరిది కూడా అందజేస్తున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు ప్రకటించారు.