
వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన నీరజ్ చోప్రా.. ఈ ఏడాది అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు(Asian Games)లో గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధిస్తే మరో త్రోయర్ కిశోర్ కుమార్ జెనా సిల్వర్ మెడల్ అందుకున్నాడు. నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లేన్ని విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. నీరజ్ కు గట్టి పోటీ ఇచ్చిన కిశోర్ 86.77 మీటర్లు విసిరి సెకండ్ ప్లేస్ దక్కించుకున్నాడు.
ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఆసియా అథ్లెటిక్ గా గతంలోనే చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఆర్మీలోని రాజ్ పుతానా రైఫిల్స్ లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(JCO)గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నవయసులోనే భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును నీరజ్ చోప్రా 2021లో అందుకున్నాడు. ఇక 2018లో అర్జున అవార్డు, 2022లో పద్మశ్రీ పురస్కారాలు పొందాడు.