మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇప్పటికే రణ్ బీర్ కపూర్ కు ED(Enforcement Directorate) సమన్లు జారీ చేయగా.. ఈరోజు మరో ముగ్గురికి సమన్లు పంపించింది. మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి కమెడియన్ కపిల్ శర్మతోపాటు హ్యూమా ఖురేషి, హీనా ఖాన్ లకు సమన్లు పంపింది. విచారణలో భాగంగా ప్రశ్నించేందుకు తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ కు ఈ నెల 4న ED సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6న రాయ్ పూర్ లోని ఆఫీస్ కు విచారణకు రావాలని సమన్లలో తెలియజేసింది.
మరింతమందికి సమన్లు
రణ్ బీర్, కపిల్, హ్యూమా ఖురేషి, హీనా ఖాన్ తదతరులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం నిర్వహించారు. ఈ కేసుతో మొత్తం 15 మంది బాలీవుడ్ నటులకు సంబంధాలున్నట్లు ED గుర్తించింది. ఈ నలుగురితోపాటు మిగతా యాక్టర్స్ కు సైతం సమన్లు పంపాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.