గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని TSPSC(Telangna State Public Service Commission) విడుదల చేసింది. ఈ తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచింది. పేపర్-1లో 7 ప్రశ్నలు తొలగించగా.. 8 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ మార్పు చేసినట్లు తెలిపింది. పేపర్-2లో రెండు ప్రశ్నలు తొలగించడంతోపాటు 5 క్వశ్చన్స్ కి ఆప్షన్స్ మార్చింది.
ఆగస్టు 28 నాడు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసిన TSPSC.. క్యాండిడేట్స్ నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. సదరు అభ్యంతరాలపై నిపుణుల(Experts) సలహాలు తీసుకుని మార్పులు, చేర్పులతో ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసింది.