ప్రస్తుత సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీకి చెందిన B.L.సంతోష్. కమలం పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సంతోష్.. హైదరాబాద్ లో మాట్లాడారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఔషాపూర్ లోని VBIT కాలేజీలో BJP రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొని పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన… రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి BJPకి అవకాశాలు ఉన్నాయన్నారు.
CM ఎవరనేది తర్వాత… గొడవలు మానేస్తేనే
‘మనలో మనం గొడవ పడితే కలిగేది నష్టమే తప్ప లాభం ఉండదు.. అందుకే గొడవలు, మనస్పర్థలు మానేసి కలసికట్టుగా అందరూ పనిచేస్తే ఆశించిన రీతిలో సీట్లు గెలుచుకోవచ్చు.. తెలంగాణ, బెంగాల్ ముఖ్యమంత్రుల వ్యవహారశైలి ఒకే విధంగా ఉంటుంది.. వారిద్దరూ ఒకేలా ఉంటారు.. రాష్ట్రంలో 119 సీట్లుంటే 2,000 మంది టికెట్ అడుగుతున్నారు.. లోకల్ గా బలంగా ఉంటేనే ఈసారి MLA టికెట్ ఇస్తాం.. CM ఎవరనేది హైకమాండ్ చూసుకుంటుంది’ అని B.L.సంతోష్ అన్నారు.