
విమానాన్ని హైజాక్ చేయబోతున్నామంటూ వచ్చిన మెయిల్ తో అలజడి మొదలైంది. దీంతో భద్రతా సిబ్బంది సదరు విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరాల్సిన విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు అంగతుకుడు మెయిల్ పంపాడు. అలర్ట్ అయిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది.. సదరు ఫ్లైట్ ను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.
అదుపులో ముగ్గురు…?
విమానాన్ని హైజాక్ చేయబోతున్నామంటూ వచ్చిన మెయిల్ పై నిఘా పెట్టిన అధికారులు అది ఎక్కణ్నుంచి వచ్చిందనే దానిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని భద్రతా సిబ్బంది ధ్రువీకరించలేదు.