ఎలక్షన్ షెడ్యూల్(Election Schedule) రిలీజ్ అయిన దృష్ట్యా ఇక పార్టీలు ప్రచార(Campaign) రంగంలోకి దూకుతున్నాయి. అధికార BRS సెప్టెంబరు 21 నాడే అభ్యర్థుల్ని ప్రకటించగా.. కాంగ్రెస్, BJP సహా అన్ని పార్టీలు అదే పనిలో ఉన్నాయి. ఇప్పటివరకు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం నిర్వహించగా.. ఇకనుంచి KCR రంగంలోకి దిగబోతున్నారు. ముఖ్యమంత్రి జిల్లాల టూర్ కు సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది. ఈ నెల 15 నుంచి జిల్లాల పర్యటనలకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లు చుట్టి వచ్చేలా ముఖ్యమంత్రి టూర్ ఖరారైంది. పోలింగ్ జరిగే వరకు చేపట్టే ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ తయారు చేశారు. ఇప్పటికే ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, మహిళలు, బీసీలు, మైనార్టీలే లక్ష్యంగా మ్యానిఫెస్టో ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రకటించే వరాల గురించి ఇప్పటికే KTR పలు సభల ద్వారా తెలియజేశారు.
15న అభ్యర్థులకు బీఫారాలు
జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్న కేసీఆర్… వారం రోజుల తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అంతకుముందుగానే ఈ నెల 15న పార్టీ అభ్యర్థులతో ఆయన భేటీ కానున్నారు. నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, నామినేషన్లు వేయాల్సిన తీరును వివరించడంతోపాటు అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వనున్నారు. మరోవైపు అదే సమయంలో BRS మేనిఫెస్టో(Manifesto)ను ప్రకటిస్తారు. రెండు చోట్ల పోటీ చేస్తున్న కె.చంద్రశేఖర్ రావు.. సెంటిమెంట్ ప్రకారం నవంబరు 9న కోనాయిపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల చేసిన అనంతరం గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. గత ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా ఈసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. రోజుకు రెండు లేదా మూడు సభలు ఉండేలా ప్లాన్ చేశారు.
కేసీఆర్ షెడ్యూల్ ఇలా..
అక్టోబరు 15… హుస్నాబాద్
అక్టోబరు 16… జనగామ, భువనగిరి
అక్టోబరు 17… సిద్దిపేట, సిరిసిల్ల
అక్టోబరు 18… జడ్చర్ల, మేడ్చల్